Chinthaledhika Yesu Puttenu|చింతలేదిక యేసు పుట్టెను|Song lyrics

ప॥ చింతలేదిక యేసు పుట్టెను - వింతగను బెత్లహే మందున
చెంతజేరను రండి సర్వజనాంగమా సంతసమొందుమా

1. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా 
ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి - స్తుతులొనరించిరి ॥చింత॥ 

2. చుక్క గనుగొని జ్ఞానులెంతో - మక్కువతో నా ప్రభుని గనుగొన
చక్కగా బెత్లహేము పురమునజొచ్చిరి కానుకలిచ్చిరి ॥చింత||

3. కన్యగర్భము నందుపుట్టెను - కరుణగల రక్షకుడు క్రీస్తుడు. 
ధన్యులగుటకు రండి వేగమె దీనులై - సర్వమాన్యులై
॥చింత||

4. పాపమెల్లను పరిహరింపను - పరమరక్షకుడవతరించెను 
దాపుజేరిన వారి కిడుగడు - భాగ్యము - మోక్షరాజ్యము॥చింత॥ 

Post a Comment

0 Comments