1. అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను
ద్వేషాగ్ని జ్వాలలో - దోషివై నిలిచావా
నా దోష క్రియలకై సిలువలో బలియైతివా
నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా ||కలువరి||
2. దారి తప్పిపోయిన గొఱ్ఱెనై తిరిగాను
ఏ దారి కానరాక సిలువదరికి చేరాను
ఆఖరి రక్తపుబొట్టును నా కొరకై ధారబోసి
నీ ప్రాణత్యాగముతో విడిపించితివా ||కలువరి||
0 Comments