1. లోకాన శాశ్వతానందమేమియు - లేదని చెప్పెను ప్రియుడేసు
పొందవలె నీలోకము నందు - కొంతకాల మెన్నో శ్రమలు ॥సీ॥
2. ఐగుప్తును విడిచినట్టి మీరు - అరణ్య వాసులే యీ ధరలో
నిత్యనివాసము లేదిలలోన - నేత్రాలు కానానుపై నిల్పుడి ॥సీ॥
3. మారాను పోలిన చేదైన స్థలముల - ద్వారా పోవలసి యున్ననేమి?
నీ రక్షకుండగు యేసే నడుపును - మారని తనదు మాటనమ్ము ॥సీ॥
4. ఐగుప్తు ఆశలన్నియు విడిచి - రయముగ యేసుని వెంబడించి
పాడైన కోరహు పాపంబు మాని - విధేయులై విరాజిల్లుడి ॥సీ॥
5. ఆనందమయ పరలోకంబు మనది - అచ్చటి నుండి వచ్చునేసు
సీయోను గీతము సొంపుగ కలసి - పాడెదము ప్రభుయేసుకు జై ॥సీ॥
0 Comments