54 Bethlahemulo Sandadi / బెత్లహేములో సందడి / Athmiya Geethalu

ప॥ బెత్లహేములో సందడి పశులపాకలో సందడి
శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని (2)

1. ఆకాశములో సందడి - చుక్కలతో సందడి (2)
వెలుగులలో సందడి - మిలమిల మెరిసె సందడి (2) ॥బె॥

2. దూతల పాటలతో సందడి - సమాధాన వార్తతో సందడి (2)
గొల్లలపరుగులతో సందడి - క్రిస్మస్ పాటలతో సందడి (2) ॥బె॥

3. దావీదు పురములో సందడి - రక్షకుని వార్తతో సందడి (2)
జ్ఞానుల రాకతో సందడి - లోకమంత సందడి (2) ॥బె॥

Post a Comment

0 Comments