స్తోత్రము చేసి స్తుతించెదను - సంతసమున నిన్ను పొగడెదను
అ॥ హల్లెలూయ - హల్లెలూయ
హల్లెలూయ - అని పాడెదను - ఆనందముతో సాగెదను.
1. ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్ధముగ జీవించుటకై - పాపిని నను కరుణించితివి ॥హ॥
2. అల్పకాల శ్రమలనుభవింప - అనుదినము కృప నిచ్చితివి
నాధుని అడుగు జాడలలో - నడచుటకై - నను పిలిచితివి ॥హ॥
3. మరణ శరీరము మార్పు నొంది - మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నను నింపితివి - మరణ భయములను దీర్చితివి ॥హ॥
4. భువి నుండి శ్రేష్ట ఫలముగను - దేవునికి నిత్య స్వాస్థ్యముగ
భూజనములలో నుండి నన్ను - ప్రేమించి క్రయ ధనమిచ్చితివి ॥హ॥
5. ఎవరు పాడని గీతమును - యేసుతో నేను పాడుటకై
హేతువు లేకయే ప్రేమించెన్ - యేసుకు నేనే మివ్వగలన్ ॥హ॥
0 Comments