Nadipinchu Nanaava | నడిపించు నానావ | Song Lyrics

ప॥ నడిపించు నానావ - నడిసంద్రమున దేవా
నవజీవన మార్గమున - నా జన్మ తరియింప

1.నా జీవిత తీరమున - నా అపజయ భారమున 
నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు
నాయాత్మ విరబూయా - నా దీక్ష ఫలియింప 
నానావలో కాలిడుము - నా సేవ జేకొనుము ||నడి||

2. రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభూ జయము
రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో
రతనాలను వెదుకుటలో - రాజిల్లు నా పడవ ||నడి||

3.ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి
ఆశా నిరాశాయె - ఆవేద నెదురాయె
ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడె నావలలు ||నడి||

4.ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో - ప్రావీణ్యమును బొంది
బలహీనుడనై ఇపుడు - పాటింతు నీమాట ||నడి||

5.లోతైన జలములలో - లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి - లోపంబులు సవరించి
లోనున్న ఈవులతో - లోతైన నా బ్రతుకు
లోపించని యర్పణగా - లోకేశ చేయుమయా ||నడి||

6.ప్రభుయేసుని శిష్యుడనై - ప్రభుప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో - పరిశుద్ధుని ప్రేమకథ 
పరమాత్మ ప్రోక్షణతో - పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభుకొరకు - పానార్పణముచేతు ||నడి||

Post a Comment

0 Comments