Ayane Na Sangeethamu | ఆయనే నా సంగీతము | Song Lyrics

ప॥ ఆయనే నా సంగీతము - బలమైన కోటయును 
జీవాధిపతియు ఆయనే - జీవితకాలమెల్ల స్తుతించెదను (2)

1. స్తుతుల మధ్యలో నివాసం చేసే - దూతలెల్ల పొగడే దేవుడాయెనే 
వేడుచుండు భక్తుల మొరలు వినే 
దిక్కులేని పిల్లలకు దేవుడాయెనే (2) ॥ ఆయనే॥

2. ఇద్దరు ముగ్గురు నా నామమున - ఏకీభవించిన వారి మధ్యలోన 
ఉండెదననిన మన దేవుని
కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2) ॥ ఆయనే॥

3. సృష్టికర్త క్రీస్తు యేసు నామమును 
జీవితకాలమెల్ల కీర్తించెదము 
రాకడలో ప్రభుతో నిత్యముందుము 
మ్రొక్కెదము స్తుతింతుము - పొగడెదము (2) ॥ ఆయనే॥

Post a Comment

0 Comments