Ascharyamaina Prema | ఆశ్చర్యమైన ప్రేమ | Song Lyrics

ప॥ ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ 
మరణముకంటే - బలమైన ప్రేమది - నన్ను జయించె నీ ప్రేమ 

1. పరమును వీడిన ప్రేమ ధరలో - పాపిని వెదకిన ప్రేమ 
నన్ను కరుణించి ఆదరించి సేదతీర్చి నిత్యజీవమిచ్చె ॥ 2॥ ॥ ఆశ్చర్య॥ 

2. పావన యేసుని ప్రేమ సిలువలో - పాపిని మోసిన ప్రేమ 
నాకై మరణించి జీవమిచ్చి - జయమిచ్చి తన మహిమ నిచ్చే ॥ 2॥ ॥ఆశ్చర్య॥

3. నా స్థితిజూచిన ప్రేమ నాపై - జాలిని చూపిన ప్రేమ 
నాకై పరుగెత్తి కౌగలించి - ముద్దాడి కన్నీటిని తుడిచే ॥ 2॥ ॥ ఆశ్చర్య ॥

4. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ
 విడనాడని ప్రేమది - ఎన్నడూ ఎడబాయదు ॥2॥ ॥ఆశ్చర్య॥

Post a Comment

0 Comments