Nakentho Anandham Nee Sannidhi |నాకెంతో ఆనందం నీ సన్నిధి|Song Lyrics

ప|| నాకెంతో ఆనందం నీ సన్నిధి - ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయ్యే

1. ఏ అపాయము నను సమీపించక - ఏ రోగమైనను నాదరికి చేరక నీవు నడుపు మార్గములో నా పాదము జారక నీ దూతలే నన్ను కాపిడితిరా

2. నా వేదనలో నిన్ను వేడుకొంటిని నా రోదనలో నీకు మొర్ర పెట్టితిని నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివి. నాకన్న తండ్రి కాపాడుచుంటివా.

3. నూతన యెరూషలేం నా గమ్యమేనని - నా కొరకు నీవు సిద్ధ పరచుచుంటివా - నీవుండు స్థలములో నేనుండ గోరెదను నా వాంఛ అదియే శ్రీ యేసయ్య

Post a Comment

0 Comments