అవతారమూర్తి యేసయ్య కీర్తి - అవని చాటుచున్
ఆనంద సంద్ర ముప్పొంగెనాలో అమర కాంతిలో
ఆది దేవుని జూడ - ఆశింప మనసు - పయనమైతిని
॥ అండాలు॥
1. విశ్వాసయాత్ర దూరమెంతైన - విందుగ దోచెను
వింతైన శాంతి వర్షించే నాలో - విజయ పధమున విశ్వాల నేలెడి దేవకుమారుని - వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము-ప్రవహించే ప్రేమ-విశ్రాంతి నొసగుచున్ ॥అందాల॥
2. యెరుషలేము రాజనగరిలో -యేసుని వెదకుచూ
యెరిగిన దారి తొలగినవేళ - యెదలో కృంగితి
యేసయ్య తార ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో
ఎంతో అబ్బురపడుచు - విస్మయమొందుచు - ఏగితి స్వామికడకు॥అందాల॥
3. ప్రభుజన్మ స్థలము పాకయేగాని - పరలోక సౌధమే బాలుని జూడ జీవితమంతా - పావనమాయెను
ప్రభుపాద పూజ దీవెన కాగ - ప్రసరించే పుణ్యము
బ్రతుకే మందిరమాయె - అర్పణలే సిరులాయె - ఫలియించె ప్రార్ధన ॥అందాల॥
0 Comments