మరువలేనదీ నాపై నీకున్న అనురాగము
యేసయ్యా నీ నామ స్మరణయే
నీ శ్వాస నిశ్వాసలాయేనే
1.సంధ్యారాగము వినిపించినావు
నా హృదయ వీణను సవరించినావు
నా చీకటి బ్రతుకును వెలిగించినావు
నా నోట మృదువైన మాటలు పలికించినావు || శాశ్వత ||
2.నా విలాప రాగాలు నీవు విన్నావు
వేకువ చుక్కవై దర్శించినావు
అపవాది ఉరుల నుండి విడిపించినావు
శత్రువులను మిత్రులుగా నీవు మార్చియున్నావు || శాశ్వత ||
0 Comments