జయగీతమే పాడనా (2)
నా ఆధారమైయున్న
యేసయ్యా నీకు - కృతజ్ఞుడనై
జీవితమంతయు సాక్షినై యుందును (2)
1. నమ్మదగినవి నీ న్యాయ విధులు
మేలిమి బంగారు కంటే - ఎంతో కోరతగినవి (2)
నీ ధర్మాసనము - నా హృదయములో స్థాపించబడియున్నది - పరిశుద్ధాత్మునిచే (2)
|| స్తుతి ||
2.శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు
లౌకిక జ్ఞానము కంటే - ఎంతో ఉపయుక్తమైనవి (2) కృపావరములతో నను – అలంకరించితివే (2)
నీ శ్రేష్టమైన - పరిచర్యలకై ॥ స్తుతి ||
3. నూతనమైనది నీ జీవ మార్గము
విశాల మార్గము కంటే - ఎంతో ఆశించదగినది (2)
నీ సింహాసనము - నను చేర్చుటకై
నాతో నీవుంటివే - నా గురి నీవైతివే (2)
॥ స్తుతి ||
0 Comments