149 Lemmu Thejarillumu | లెమ్ము తేజరిల్లుము అని | Song Lyrics

పల్లవి : లెమ్ము తేజరిల్లుము అని - నను ఉత్తేజపరచిన నా యేసయ్యా! 
నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు 
రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద

1. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృపచూపితివి 
ఇదియే భాగ్యము- ఇదియే భాగ్యము - ఇదియే నా భాగ్యము ॥ లెమ్ము ||

2. శ్రమలలో నీను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత
జీవకిరీటమునే పొదుటకే - నను చేరదీసితివి 
ఇదియే ధన్యత - ఇదియే ధన్యత - ఇదియే నా ధన్యత ॥ లెమ్ము ॥

3.తేజోవాసుల స్వాస్థ్యము నేను అంభవించుతే నా నా దర్శనము
తేజోమయమైన షాలేము నగరులో - నిత్యము నిను చూచి తరింతునే
ఇదియే దర్శనము - ఇదియే దర్శనము - ఇదియే నా దర్శనము || లెమ్ము ||

Post a Comment

0 Comments