Adagaka Munupe |అడగక మునుపే |Song Lyrics

పల్లవి : అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన
వాడవు 
అడిగిన వాటికింటే అత్యధికముగా చేయుచున్నావు 
యేసయ్య నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని?

1. నాకు సహాయము చేయుటకై - నీ దక్షిణ హస్తము చాపితివే
సత్య సాక్షిగా నేనుండుటకై ఉపకరములెన్నో
- చేసితివే
హల్లెలూయ - ఉపకరములెన్నో చేసితివే ||అడగక|||

2. నాకు దీర్గాయువునిచ్చుటకే - నీ హితోపదేశము
పంపితివే
నిత్యజీవము నేపొందుటకు - పునరుత్థానము
నొందితివే
హల్లెలూయ - పునరుత్థానము నొందితివే ||అడగక|||

3. నాకు ఐశ్వర్యమునిచ్చుటకే - నీ మహిమైశ్వర్యము విడిచితివే
మహిమలో నీతో నేనుండుటకే - మహిమాత్మతో నన్ను నింపితివే
హల్లెలూయ - మహిమాత్మతో నన్ను నింపితివే
||అడగక||

Post a Comment

0 Comments