ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసునామము
అ॥ యేసునామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము ॥2॥
హల్లెలూయ హోసన్నా హల్లెలూయ - హల్లెలూయ ఆమెన్
1. పాపములనుండి విడిపించును - యేసను నామము
నిత్యనరకాగ్నిలో నుండి రక్షించును - క్రీస్తేసు నామము ॥యేసు॥
2. సాతాను పై అధికారమిచ్చును - శక్తికలిగిన యేసు నామము ॥2॥
శత్రుసమూహముపై జయము నిచ్చును - జయశీలుడైన యేసు నామము ॥యేసు॥
3. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు - క్రొత్తకీర్తన పాడెదము
జయధ్వజమును పైకెత్తి కేకలతో- స్తోత్రనాదము చేయుదుము ॥యేసు||
0 Comments