యేసయ్యా నాపై నీవు చూపిన కృప అమూల్యమైనది వర్ణించలేనిది (2)
1.ఊహించలేని హృదయానందమును దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు (2) భారమెక్కువైనా తీరం కడుదూరమైనా నీపై ఆనుకొందును నేను గమ్యం చేరుకొందును (2) ॥ అవధులే ||
2.సరిపోల్చలేని మధురమైన అనుభవం వింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు (2)
సౌందర్యమైన అతిపరిశుద్ధమైన నీ రూపము తలచుకొందును నేను నీ కోసమే వేచియుందును (2) ॥ అవధులే ||
3.లెక్కించలేని అగ్ని శోధనలో ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు (2)
వాడబారని కిరీటము నే పొందుటకు వెనుకున్నవి మరచి నేను లక్ష్యము వైపు సాగెద (2) || అవధులే ||
0 Comments