57 Randi Yusthahinchi / రండి యుత్సాహించి / Athmiya Geethalu

ప॥ రండి యుత్సాహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే

1. రండి కృతజ్ఞత స్తోత్రముతో - రారాజు సన్నిధి కేగుదము 
సత్ప్రభు నామము కీర్తనలన్ - సంతోష గానము చేయుదము ॥రండి॥

2. మన ప్రభువే మహాదేవుండు - ఘన మహాత్మ్యము గలరాజు
భూమ్యాగాధపు లోయలును భూధర శిఖరము లాయనవే ॥రండి॥

3. సముద్రము సృష్టించే నాయనదే - సత్యుని హస్తమే భువిన్ జేసెస్ 
ఆయన దైవము పాలితుల మాయన మేపెడి గొట్టెలము.

4.ఆ ప్రభు సన్నిధి మోకరించి - ఆయన ముందర మ్రొక్కుదము
ఆయన మాటలు గైకొనిన - నయ్యది మనకెంతో మేలుగును ॥రండి॥

5. తండ్రి కుమార శుద్ధాత్మకును - దగుస్తుతి మహిమలు కల్గుగాక 
ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు - నయినట్లు యుగముల నౌను ఆమెన్ ॥రండి॥

Post a Comment

0 Comments