మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది
1. యెరుషలేము యెహోవాయె - కట్టుచున్నవాడని ||2||
ఇశ్రాయేలీయులను - పోగుచేయువాడని ||దేవునికి||
2. గుండె చెదరిన వారిని - బాగు చేయువాడని
వారి గాయములన్నియు - కట్టుచున్నవాడని ॥దేవునికి||
3. నక్షత్రముల సంఖ్యను - ఆయనే నియమించెను
వాటికన్నియు పేరులు - పెట్టుచున్నవాడని ||దేవునికి||
4. ప్రభువు గొప్పవాడును - అధికశక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే - మితియు లేనివాడని ॥దేవునికి||
5. దీనులకు అండాయనే - భక్తిహీనులు కూల్చును సితారాతో దేవుని - స్తుతులతో కీర్తించుడి ||దేవునికి||
6. ఆయన ఆకాశమున్ - మేఘములతో కప్పును భూమి కొరకు వర్షము - సిద్ధపర్చువాడని ||దేవునికి||
7. భూమికి తన యాజ్ఞను - ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని - వాక్యము పరుగెత్తును ||దేవునికి||
8. వాక్యమును యాకోబుకు - తెలియజేసినవాడని ఏ జనముకీలాగున - చేసి యుండలేదని ||దేవునికి||
0 Comments