నిన్నేనమ్మో ఏసయ్య పిలిచినాడు
1. తాగుబోతు వైనోడ - తగాదాలు పడినోడ
అటు ఇటు తిరిగినోడ - అల్లరిపాలైనోడ
చీట్లపేకలాడి నీవు చెల్లకుండ పోయినోడ ॥ నిన్నే॥
2. ఇంటర్మీడియట్ తప్పినోడ - ఎటుగాక పోయినోడు
10వ తరగతి పోయినోడ చదువురాక తిరిగినోడ
బి.ఎ. నీవు చదివేవ - బతకలేకపోయావ ॥ నిన్నే॥
3. పార్టీలో తిరిగినోడ పనికిరాకపోయినోడ
ఉద్యోగం ఊడినోడ ఎలక్షన్లో ఓడినోడ
అప్పుల పాలయ్యావ తిప్పలు పడుతున్నావా ॥ నిన్నే॥
4. డబ్బు లెక్కువైనోడ - నిదరపట్టకున్నవాడ
వడ్డీలకు తిప్పేటోడ - వర్రీలో పడ్డవాడ
కులము కులము అన్నావ కూడులేక చచ్చావ ॥ నిన్నే॥
0 Comments