219 Kanaanu Yatra Idhi Seeyonu | కానాను యాత్ర - యిది సీయోను | Athmiya Geethalu

ప: కానాను యాత్ర - యిది సీయోను యాత్ర 
ఐగుప్తు విడిచిన - విశ్వాస యాత్ర ॥కానా॥

1. ఎర్ర సముద్రం - ఎదురుగా నిలిచింది 
ఫరో సైన్యం - వెనుక తరుముతోంది (2) 
యేసు వైపు చూడగ - ఆయనను వేడగా (2) 
ఫరో సైన్యం ఆగింది - ఎఱ్ఱ సముద్రం పాయలయ్యింది (2) ॥కానా॥

2. లోకములో విశ్వాసికి - శ్రమ తప్పక కలుగును 
సాతానుడు విడువక - శోధింపక మానడు (2) 
లోకమును జయించిన - యేసు మనకు ఉన్నాడు 
జయ జీవితము - తప్పక దయచేస్తాడు (2) ॥కానా॥

Post a Comment

0 Comments