ప॥ రాజాధిరాజ నీకే వందనాలు
రవికోటి తేజ నీకే వందనాల (2)
1.పాపిని కరుణించి - ప్రాణదాన మిచ్చావు
పరమా జీవమిచ్చి - పరలోక రాజ్యమిచ్చి
పండ్రెండు గుమ్మముల పట్టణమే నాకు కట్టబెట్టినావా ॥రాజాధిరాజ॥
2. నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు
నీ నీతి నాకిచ్చి నిత్యరాజ్యమిచ్చావు
నీ నీతి నీ రాజ్యం - నిండైన నా భాగ్యమే ॥రాజాధిరాజ॥
3. హీనుని దీవించి - ఘనునిగా చేసావు
నీరు కార్చి నా ఋణము తీర్చావు
నా చల్లనయ్యా - నా అన్న నీవే నా యేసయ్యా ॥రాజాధిరాజ॥
4. కన్ను మిన్ను కానకుండా నిన్ను వీడిపోయాను
చిన్నబుచ్చు కోకుండా నన్ను సమకూర్చావు
నీ మనసే వెన్నయ్యా నా కన్న తండ్రి నా యేసయ్యా ॥రాజాధిరాజ॥
0 Comments