శృంగార ప్రభువునకు - క్షేమాధిపతికి మంగళమే
1. పరమ పవిత్రునకు - వర దివ్య తేజునకు
నిరుపమానందునకు - నిపుణవై వేద్యునకు మంగళమే
2.దురిత సంహారునకు - వర సుగుణోద్దారునకు
కరుణా సంపన్నునకు - జ్ఞాన దీప్తునకు మంగళమే ॥మంగ॥
3. సత్య ప్రవర్తునకు - సద్ధర్మ శీలునకు
నిత్య స్వయం జీవునకు - నిర్మలాత్మునకు మంగళమే ॥మంగ॥
4. యుక్తస్తోత్రార్హునకు - భక్త రక్షామణికి
సత్య పరంజ్యోతియగు - సార్వభౌమునకు మంగళమే ॥మంగ॥
5. పరమపురి వాసునకు - నరదైవ రూపునకు
పరమేశతనయునకు - బ్రణుతింతుము నిన్నుమంగళమే ॥మంగ॥
0 Comments