నను నెమ్మదితో నీవు ఉంచెదవు
ఆపత్కాలమున నమ్ముకొనదగిన (2)
అ: యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము (2)
1. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను
బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను ॥ యేసు॥
2. బలమును నమ్ముకొని భంగపడ్డా
శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను ॥ యేసు॥
3. ధనమును నమ్ముకొని ధగా పడ్డాను
సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను ॥ యేసు॥
4. మనుష్యుల నమ్ముకొని మభ్య పడ్డాను
సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను ॥ యేసు॥
0 Comments