నీ ప్రేమ కౌగిలిలో నను ఒదిగిపోనీ
నీ ఆత్మతో నను నిండనీ నీ సాక్షిగ యిలలో నన్నుండనీ
1. నా లోపల సంచరించి నాతో భుజియించి
నా జీవితం వెలిగించినావా - నీ రూపమే నాలో ముద్రించినావా ॥ నాహృదయ॥
2. బలహీనతలను హరియించి శక్తితో దీవించి
అజ్ఞానం నిర్మూలించి సత్యము బోధించి
నా భారమే భరియించినావా - నీ శాంతినే నాలో స్థాపించినావా ॥ నాహృదయ॥
3. అనురాగముతో బంధించి ఆప్యాయత పెంచి
ఆనందం అనుగ్రహించి ఆత్మీయత పెంచి
నాశోకమే తొలగించినావా స్తుతియాగమే నాలో పలికించినావా ॥నాహృదయ॥
0 Comments