179 Naadhi Naadhi antu | నాది నాది అంటూ | Athmiya Geethalu

ప: నాది నాది అంటూ వాగులాట నీకెందుకు 
ఏది నీది కాదు - సత్యమిది ఎరుగవేందుకు 
ఇహలోక ఆశలెందుకు - పై నన్ను వాటిని వెదకు (2)

1. నిన్న నీది అనుకున్నది - నేడు నీకు కాకపోయేనే - నేడు నీకు 
ముందున్నది-రేపు కానకరాకపోవునే క్షణకమైన వాటికొరకు పాకులాట 
నీ కెందుకు - అక్షయ దైవరాజ్యమే నిలుచును తుదవరకు  (2)

2. నీ దగ్గర ధనముంటే నీచుట్టు మనుష్యులుంటారు - నీ లోపల 
బలముంటే నిను మా వాడంటారు - నీ ధనము - నీ బలగం 
నీ చావు నాపలేవు - తప్పకుండ ఒకనాడు మట్టిలోన కలుస్తావు  (2)

3. నీకున్న గొప్ప చాకీ - నిన్ను రక్షించలేదు - నీ యొక్క సొంతనీతి 
శిక్షను తప్పించలేదు - గడ్డిపువ్వులాంటిదేగా-ఇలలోన నీదు జీవితము 
యేసయ్యకు అర్పిస్తే అవుతుందిలే సార్ధకము శాశ్వతం (2)

Post a Comment

0 Comments