నీ మందిరాన నీసన్నిధాన - నీఆత్మతో నన్ను నింపుమయా
యేసయ్యా..ఆ...ఆ..యేసయ్యా ఆ..ఆ... యేసయ్యా ఆ...ఆ.. యేసయ్యా.... యేసయ్యా....(2)
1. కన్నీళ్ళైనా కష్టాలెదురైనా - కడవరకు నను చేర్చుమయ్యా
కరువు తోడైనా - కలిమి వేరైనా - కరుణించి కాపాడుమయ్యా
నా వేదనలో నీజాలితో - నా శోధనలో నీ చేతితో
నిత్యము నను నడిపించుమయ్యా....... ॥యేసయ్యా॥
2. నా వారే నన్ను నిందించువేళ - నను విడిచి పోబోకుమయ్యా
ఆదరణ నాకు కరువైనవేళ - దరిచేరి ఓదార్చుమయ్యా
నా నిందలలో నాతోడువై - అపనిందలలో నా చేరువై
నిత్యము నను నడిపించుమయ్యా.... ॥యేసయ్యా॥
3. నా కాలు జారి తొట్రిల్లువేళ - చేజారి నిలబెట్టుమయ్యా
సాతాను నన్ను బంధించువేళ - నను చేరి విడిపించుమయ్యా
నీ చేతితో నను పట్టుకో - నీ సేవలో నను వాడుకో
నిత్యము నను నడిపించుమయ్యా..... ॥యేసయ్యా॥
0 Comments