ప: నాలోని ఆశ - నాలోని కోరిక - నిన్ను చూడాలని
నాలోని ఆశ - నాలోని కోరికా నిన్ను చేరాలని
దేవా యేసయ్యా నిన్ను చూడాలని
దేవా యేసయ్యా నిన్ను చేరాలని...
Jesus I want Worship You
Jesus I want to Praise the Lord
My Jesus I want to see you...Forever
1. శ్రమలు నన్ను తరిమినా - విడువలేదు నీకృపా
వేదనలో నేను కృంగినా - లేవనెత్తును నీచెయ్యి
ఎన్నియుగాలకైననూ - స్తుతులకు పాత్రుడా
తరతరాలు మారినా - మారని దేవుడా... ఆడి
Jesus I want Worship You
2. విరిగిన నలిగిన మనసుతో - నీ దరిచేరితి యేసయ్యా
మధురమైన నీప్రేమతో - నన్ను నింపుము నాదేవా
నలుదిశల వరకు దేవా - నిన్నే కీర్తింతునూ
నాబ్రతుకు దినములన్ని - నిన్నే పూజింతును.. (2)
0 Comments