ఎలా నడువగలను - ఎలా బ్రతుకగలను (2) కార్తీ
నీతోడు నీడ లేకుండా (2)
నీ ప్రేమ వర్ణించలేనిది - నీ ప్రేమ వివరించలేనిది
నీ ప్రేమ మరచిపోలేనిది - నీ ప్రేమ విడిచిపోలేనిది
1. శాశ్వత ప్రేమతో ప్రేమించావు - కునుకక కాపాడి రక్షించావు
విడువక యెడబాయక తోడున్నావు
సర్వకాలము నాతో ఉన్నావు ॥ఎలా॥
2. పాపిని నన్ను ప్రేమించావు నా కొరకు నీవు ప్రాణమిచ్చావు
రక్తము చిందించి విమోచించావు
నీ సొత్తుగ నన్ను చేసుకొన్నావు ॥ఎలా॥
3. శ్రమలలో నన్ను విడిపోలేదు - దుఃఖములో నన్ను ఓదార్చావు
మేలులతో నన్ను తృప్తిపరిచావు
నిత్యము నన్ను నడిపించావు ॥ఎలా॥
0 Comments