యేసుతో నూతన యెరూషలేము యాత్రా
1. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును
వేయినోళ్ళతో స్తుతియించినాను - తీర్చలేము ఆ ఋణమునూ ॥ఆ॥
2. రాత్రియూ పగలునూ - పాదములకు రాయి తగులకుండా
మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మన కుండగా ॥ఆ॥
3. కృతజ్ఞతా లేనివారు - వేలకొలదిగా కూలిననూ
కృపా వాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందెదం ॥ఆ॥
4. ఆనందం ఆనందం - యేసుని చూసే క్షణమాసన్నం
ఆత్మానంద భరితులమై - ఆగమన కాంక్షతో సాగెదము ॥ఆ॥

0 Comments