Andharu Nannu Vidachina|అందరు నన్ను విడచినా|Song Lyrics

ప॥ అందరు నన్ను విడచినా - నీవు నన్ను విడువనంటివే 
నా తల్లియు నీవే - నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా

1. లోకము నన్ను విడచినా - నీవు నన్ను విడువనంటివి 
నా బంధువు నీవే నా మిత్రుడ నీవే 
నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా ||అందర||

2. వ్యాధులు నన్ను చుట్టిన - బాధలు నన్ను చుట్టిన 
నా కొండయు నీవే నా కోటయు నీవే 
నా కొండ కోట నీవే యేసయ్యా ||అందర||

3. నేను నిన్ను నమ్ముకొంటిని - నీవు భయపడకంటివే 
నా తోడు నీవే - నా నీడయు నీవే 
నా తోడు నీడ నీవే యేసయ్యా ||అందర||

Post a Comment

0 Comments