104 Akashamandhunna Aseenuda | ఆకాశమందున్న ఆసీనుడా | Athmiya Geethalu

ప॥ ఆకాశమందున్న ఆసీనుడా - నీ తట్టు కనులెత్తుచున్నాను

1. చెదరిపోయిన గొర్రెను నేను - దారిగానక తిరుగుచున్నాను
కరుణించుమో యేసు కాపాడుమా - నీ తట్టు కన్నులెత్తుచున్నాను ॥ఆకాశ॥

2. గాయపడిన గొర్రెను నేను 
బాగుచేయుము పరమవైద్యుడా ॥ఆకాశ॥

3. పాప ఊబిలో పడియున్నాను
లేవనెత్తుము శుద్ధి చేయుము ॥ఆకాశ॥

4. పగిలిపోయిన పాత్రను నేను 
బాగుచేయుమా వాడుకొనుమా ॥ఆకాశ॥

5. ఆరిపోయిన దీపము నేను 
వెలిగించుమో పరిశుద్ధాత్ముడా॥ఆకాశ॥

Post a Comment

0 Comments