Bandhamu Neeve Snehamu Neeve|బంధము నీవే - స్నేహము నీవే|Song Lyrics in Telugu

పల్లవి:  బంధము నీవే - స్నేహము నీవే
అతిధివి నీవేనయ్య - ఆప్తుడవు నీవేనయ్య

1. ప్రేమించువాదా - కృపచూపు వాడా 
నాతోనే వుండి - నన్ను నడుపు వాడా
కాలాలు మారినా -మారని వాడా 
విడువవు నన్నెప్పుడు - మరువని తండ్రివయ్యా
 ||బంధము||

2. కారు చీకటి - నను కమ్ము వేళ 
వెలుగు నీవై -  ఉదయించినావు
నీ ఒడిలోన - నెమ్మది నిచ్చి
కన్నీరు తుడిచావయ్య - కౌగిలిలో దాచావయ్య
 ||బంధము||

3. మూగబోయిన నా గొంతులోన
గానము నీవై - నన్ను చేరినావా 
హృదయ వీణవై - మధుర గానమై 
నాలోన వున్నావయ్యా - నా ఊపిరి నీవేనయ్య
||బంధము||

4.ఈ లోకంలో - యాత్రికుడను 
ఎవరు లేని ఒంటరినయ్యా
నీవే నాకు - సర్వము దేవా
చాలును చాలునయ్య - నీ సన్నిధి చాలునయ్య
నాలోన వున్నావయ్యా - నా ఊపిరి నీవేనయ్య
||బంధము||

5.మోడుబారిన - నా బ్రతుకులో
నూతన చిగురును - పుట్టించినావా 
నీ ప్రేమ నాలో - ఉదయించగానే
ఫలియించె నా జీవితం - ఆనంద మానందమే
||బంధము||

Post a Comment

0 Comments