యేసయ్యా సన్నిధినే మరువజాలను
జీవిత కాలమంతా ఆనదించెదా - యేసయ్యనే ఆరాధించెదా
1.యేసయ్య నామమే బహు పూజ్యనీయము
నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి
నన్నెంతగానో దీవించి - జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే || జుంటె తేనె ||
2.యేసయ్య నామమే బలమైన దుర్గము
నాతోడై నిలచి క్షేమముగా నను దాచి
నన్నెంతగానో కరుణించి - పవిత్ర లేఖనాలతో
ఉత్తేజింపజేసెనే || జుంటె తేనె ||
3. యేసయ్య నామమే పరిమళ తైలము
నాలో నివసించె సువాసనగా నను మార్చె నన్నెంతగానో ప్రేమించి - విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే || జుంటె తేనె ||
0 Comments