90.Na Margamunaku Deepamaina| నా మార్గము నకు దీపమైన|Song Lyrics in Telugu|Hosanna Ministries

పల్లవి : నా మార్గము నకు దీపమైన 
నా యేసునితో సదా సాగెద ||2||

1. గాఢాంధకారపు లోయలలో 
మరణ భయము నన్ను కమ్మినను ||2||
ఆత్మయందు నే కృంగిపోవక అనుదినం ఆనందింపజేయునట్టి ఆత్మనాధునితో సాగెదను ||2||
॥ నా మార్గ ||

2.నాయొక్క ప్రయత్నములన్నియును 
నిష్పలముగ అవి మారినను ||2|| 
నా యొక్క ఆశలు అన్నియును 
నిరాశలుగా మారిపోయినను నిరీక్షణతో నే సాగెదను ||2|| || నా మార్గ ||

3.సమస్తమైన నా భారములు 
సంపూర్ణముగా ప్రభు తీర్చునుగా ||2||
నా సన్నిధి నీకు తోడుగా 
వచ్చునని సెలవిచ్చిన నా దేవునితో సాగెదను ||2||
॥ నా మార్గ ||

4.ప్రతి ఫలము నేను పొందుటకు 
నిరీక్షణతో నున్న ధైర్యమును ||2||
పలు శ్రమలందును విడవకుండ 
ప్రాణాత్మ దేహము సమర్పించి ప్రియుని ముఖము చూచి సాగెదను ||2|| ॥ నా మార్గ ||

Post a Comment

0 Comments