89.Na Deepamu Yesayya|నా దీపము యేసయ్యా|Song Lyrics in Telugu|Hosanna Ministries

పల్లవి : నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు
సుడిగాలిలో నైనా - జడివానలోనైనా 
ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము 
నీవు వెలిగించిన దీపము - నీవు వెలిగించిన దీపము

1.ఆరని దీపమై దేదీప్యమానమై 
నాహృదయ కోవెలపై దీపాల తోరణమై 
చేసావు పండగ - వెలిగావు నిండుగా || నా దీపము ॥

2. మారని నీ కృప నను వీడనన్నది 
మర్మాల బడిలోన సేద దీర్చుచున్నది
మ్రోగించుచున్నది - ప్రతిచోట సాక్షిగా || నా దీపము ॥

3.ఆగని హోరులో ఆరిన నేలపై 
నాముందు వెలసితివే సైన్యములకధిపతివై
పరాక్రమశాలివై - నడిచావు కాపరిగా || నా దీపము ॥

Post a Comment

0 Comments