పాపములన్నియు కడుగుచున్నది
పరమతండ్రితో సమాధానము కలిగించుచున్నది
1.దుర్ణీతి నుండి విడుదలచేసి
నీతిమార్గాన నిను నడిపించును
యేసురక్తము క్రయధనమగును
నీవు ఆయన స్వస్థమౌదువు ॥ ప్రవహించుచున్నది ॥
2. దురభిమానాలు దూరముచేసి
యథార్థ జీవితం నీకనుగ్రహించును
యేసురక్తము నిర్దోషమైనది
నీవు ఆయన ఎదుటే నిలిచెదవు ॥ ప్రవహించుచున్నది ॥
3. జీవజలముల నది తీరమున
సకలప్రాణులు బ్రతుకుచున్నవి
యేసురక్తము జీవింపజేయును
నీవు ఆయన వారసత్వము పొందెదవు ॥ ప్రవహించుచున్నది॥
0 Comments