Nithyashrayadurgamaina|నిత్యాశ్రయదుర్గమైన|Song Lyrics|Hosanna Ministries

పల్లవి : నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య 
తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి 
ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవసించెద నీలోనే

1.నా నీతిసూర్యుడా నీ నీతికిరణాలు 
నీ మార్గములలో నన్ను నడిపించెనే 
నా నిత్యరక్షణకు కారణజన్ముడా 
నీకే సాక్షిగా తేజరిల్లేదనయ్య || నిత్యా ||

2.నా అభిషిక్తుడా నీ కృపావరములు 
సర్వోత్తమమైన మార్గము చూపెనే 
మర్మములన్నియు బయలుపరుచువాడా 
అనుభవజ్ఞానముతో నేనడిచెదనయ్య || నిత్యా ||

Post a Comment

0 Comments