Na Geetharadhanalo|నా గీతారాధనలో|Song Lyrics| Hosanna Ministries

Na Geetharadhanalo|నా గీతారాధనలో

పల్లవి : నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే 
నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ - (2)

1.నీ కృప నాలో వ్యర్ధము కాలేదు - నీ కృపా వాక్యమే 
చేదైన వేరు ఏదైన నాలో - మొలవనివ్వలేదులే (2) 
నీ కృప నాలో అత్యున్నతమై 
నీతో నన్ను అంటు కట్టెనే (2) || నా గీతా ||

2.చేనిలోని పైరు చేతికి రాకున్నా - ఫలములన్ని రాలిపోయినా
సిరి సంపదలన్ని దూరమై పోయినా - నేను చలించనులే (2)
నిశ్చలమైన రాజ్యము కొరకే ఎ
ల్లవేళలా నిన్నే ఆరాధింతునే (2) || నా గీతా ||

3. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో - నిండుగా కుమ్మరించెనే
ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో - ఫలింపజేసెనే (2)
ఆత్మతో సత్యముతో ఆరాధించుచు
నే వేచియుందునే నీ రాకడకై (2) || నా గీతా ||

Post a Comment

0 Comments