మదిలోన జతగా నిలిచావు
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి
నీ పత్రికనుగా మార్చావు
1.నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై
సాగిపోదును నేను ఆగిపోలేనుగా
సాహసక్రియలు చేయు నీ హస్తముతో
నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు || మనసెరిగిన ||
2.వెనకున్న వాటిని మరచి నీతోడు నేను కోరి
ఆత్మీయ యాత్రలొ నేను సొమ్మసిల్లి పోనుగా
ఆశ్చర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో
నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు || మనసెరిగిన ||
3. మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై
ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా
నేలమంటితో నన్ను రూపించిన హస్తములే
నన్ను కౌగలించెనే వదలలేవు ఎన్నడు || మనసెరిగిన ||
0 Comments