122. Anandhame Paramanandhame | ఆనందమే పరమానందమే | Song Lyrics

పల్లవి : ఆనందమే పరమానందమే 
ఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2) 
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన 
అక్షయుడా నీకే స్తోత్రము (2)

1.పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే 
జీవ జలములు త్రాగనిచ్చితివే (2) 
నా ప్రాణమునకు సేదదీర్చితివి 
నీతియు శాంతియు నాకిచ్చితివే (2) || ఆనందమే ||

2.గాఢాంధకారము లోయలలో నేను 
సంచరించినా దేనికి భయపడను (2) 
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును 
అనుదినం అనుక్షణం కాపాడునే (2) || ఆనందమే ||

3.నా శత్రువుల ఎదుటే నీవు 
నాకు విందును సిద్ధము చేసావు (2) 
నీతో నేను నీ మందిరములో 
నివాసము చేసెద చిరకాలము (2) ॥ ఆనందమే ॥

Post a Comment

0 Comments