121. Na Pranama Naalo | నా ప్రాణమా నాలో | Songs Lyrics

పల్లవి : ఎందుకిలా జరిగిందనీ యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని 
సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే

1.నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా క్రుంగియున్నావు? 
దేవునివలన ఎన్నో మేళ్ళను అనుభవించితివే
స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా
॥ ఎందుకిలా ॥

2.నా హృదయమా ఇంకెంతకాలము ఇంతగ నీవు కలవరపడుదువు?
దేవునిద్వారా ఎన్నో ఉపకారములు పొందియుంటివే
అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా? ॥ ఎందుకిలా ॥

3.నా అంతరంగమా నీలో నీవు జరిగినవన్నీ గుర్తు చేసుకొనుమా
దేవుడుచేసిన ఆశ్చర్యక్రియలు మరచిపోకుమా
బ్రతుకు దినములన్నియు నీవు ఉత్సాహగానము
చేయుమా
॥ ఎందుకిలా ॥

Post a Comment

0 Comments