Athyunnatha Simhasanamupai Aaseenuda|అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా|Song Lyrics in Telugu|Hosanna Ministries

పల్లవి : అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా 
దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా 
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు 
నా మనసార నీ సన్నిధిలో 
సాగిలపడి నమస్కారము చేసేదా ||2||

1. ప్రతి వసంతము నీ దయా కిరీటమే 
ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే ||2||
ప్రభువా నిన్నే ఆరాధించెద
కృతజ్ఞతార్పణలతో - కృతజ్ఞతార్పణలతో ||2|| || అత్యున్నత ||

2.పరిమలించునే నా సాక్ష్య జీవితమే
పరిశుద్దాత్ముడు నన్ను నడిపించుచున్నందునే ||2||
పరిశుద్ధాత్మలో ఆనందించెద 
హర్ష ధ్వనులతో - హర్ష ధ్వనులతో  ||2||
|| అత్యున్నత ||

3.పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే 
నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే ||2||
యెహోవ నిన్నే మహిమ పరచెద 
స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో ||2|| || అత్యున్నత ||

Post a Comment

0 Comments