117.Seyonulo Sthiramaina Punadhi|సీయోనులో స్థిరమైన పునాది|Song Lyrics in Telugu|Hosanna Ministries

పల్లవి : సీయోనులో స్థిరమైన పునాది నీవు 
నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను

1. సూర్యుడు లేని చంద్రుడు లేని 
చీకటి రాత్రులు లేనే లేని 
ఆ దివ్య నగరిలో కాంతులను 
విరజిమ్మెదవా నా యేసయ్యా || సీయోనులో ॥

2.కడలి లేని కడగండ్లు లేని 
కల్లోల స్థితి గతులు దరికే రాని 
సువర్ణ వీధులలో 
నడిపించెదవా నా యేసయ్యా || సీయోనులో ||

3.కలతలు లేని కన్నీరు లేని 
ఆకలి దప్పులు అసలే లేని 
నీ శాశ్వత రాజ్యముకై 
సమకుర్చుచున్నావా నా యేసయ్యా ॥ సీయోనులో ॥

4. సంఘ ప్రతిరూపము - పరమ యెరుషలేము సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును 
నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే || సీయోనులో ॥

Post a Comment

0 Comments