నా అణువణువు నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా
నా హృదయార్పణతో ప్రాణమిల్లేదనే
నీ సన్నిధిలో పూజార్హుడా
1.అగ్ని ఏడంతలై - మండుచుండినను
అగ్ని జ్వాలలు తాకలేదులే - నీ ప్రియుల దేహాలను
అగ్ని బలము చల్లారెనే - శత్రు సమూహము అల్లాడే నే
నేను నీ స్వాస్థ్యమే - నీవు నా సొంతమే
నా స్తోత్రబలులన్నీ నీకేనయ్యా ||నా హృదయాన||
2.అంతా వ్యర్థమని - వ్యర్థులైరెదరో
నా గురి నీపై నిల్పినందుకే - నా పరుగు సార్థకమాయెనే
నీయందు పడిన పయసము - శాశ్వత కృపగా
సంఘక్షేమాభివృద్ధికే - పరిచర్య ధర్మము నియమించినావే
నీ ఉపదేశమే - నన్ను స్థిరపరచెనే
నా స్వరము నీకే అర్పింతును ||నా హృదయాన||
0 Comments