115.Nirantharam Neethone|నిరంతరం నీతోనే|Song Lyrics in Telugu|Hosanna Ministries

పల్లవి : నిరంతరం నీతోనే జీవించాలనే 
ఆశ నన్నిల బ్రతికించుచున్నది 
నాప్రాణేశ్వరా యేసయ్యా 
నా సర్వస్వమా యేసయ్యా

1.చీకటిలో నేనున్నప్పుడు - నీ వెలుగు నాపై
ఉదయించెను
నీలోనే నేను వెలగాలని - నీ మహిమ నాలో
నిలవాలని
పరిశుద్ధాత్మ అభిషేకముతో - నన్ను నింపుచున్నావు -
నీరాకడకై || నిరంతరం ||

2.నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో
కడిగితివి
నీతోనే నేను నడవాలని - నీ వలెనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు -
నీరాకడకై ॥ నిరంతరం ||

3. తొలకరి వర్షపు జల్లులలో - నీ పొలములోనే నాటితివి
నీలోనే చిగురించాలని - నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధ పరచుచున్నావు నీరాకడకై ॥ నిరంతరం ||

Post a Comment

0 Comments