114.Nammi Nammi|నమ్మి నమ్మి|Song Lyrics in Telugu|Hosanna Ministries

పల్లవి : నమ్మి నమ్మి... మనుషులను నీవు నమ్మీ నమ్మి
పలుమార్లు మోసపోయావు - పలుమార్లు మోసపోయావు 
ఇలా ఎంత కాలమూ - నీవు సాగిపోదువు

1.రాజులను నమ్మి... బహుమతిని ప్రేమించిన
బిలాముఏమాయెను -దైవ దర్శనం కోల్పోయెను 
నా యేసయ్యను నమ్మిన యెడలా 
ఉన్నత బహుమానమూ - నీకు నిశ్చయమే || నమ్మి నమ్మి ||

2.ఐశ్వర్యము నమ్మి... వెండీ బంగారము ఆశించిన
ఆకాను ఏమాయెను - అగ్నికి ఆహుతి ఆయెను 
నా యేసయ్యను నమ్మిన యెడలా 
మహిమైశ్వర్యము - నీకు నిశ్చయమే || నమ్మి నమ్మి ||

3.సుఖభోగము నమ్మి... ధనాపేక్షతో పరుగెత్తిన
గెహజి ఏమాయెను - రోగమును సంపాదించెను 
నా యేసయ్యను నమ్మిన యెడలా 
శాశ్వతమైన ఘనత - నీకు నిశ్చయమే || నమ్మి నమ్మి ||

Post a Comment

0 Comments