113.Vardhilledamu Mana Devuni Mandiramandhu|వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు|Song Lyrics in Telugu|Hosanna Ministries

పల్లవి : వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు
నాటబడినవారమై
నీతిమంతులమై మొవ్వు వేయుదము
యేసురక్తములోనే జయము మనకు జయమే 
స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే

1.యెహోవా మందిర ఆవరణములో ఎన్నోన్నె మేళ్ళు గలవు
ఆయన సన్నిధిలోనే నిలిచి - అనుభవింతుము ప్రతిమేలును ॥ వర్ధిల్లెదము ||

2.యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ గలదు 
ఆయన సముఖములోనే నిలిచి - పొందెదము
శాశ్వత కృపను || వర్ధిల్లెదము ||

3.పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు 
ఆయన మహిమైశ్వర్యము మన - దుఃఖము
సంతోషముగ మార్చును
॥ వర్ధిల్లెదము ||

Post a Comment

0 Comments