108.Bhumyakashamulanu Srujinchina|భూమ్యాకాశములు సృజించిన|Song Lyrics in Telugu|Hosanna Ministries

పల్లవి : భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా
నీకేస్తోత్రం 
నీ ఆశ్చర్యమైనక్రియలు-నేనెలామరచిపోదును
హలెలూయలూయ... లూయ... హలెలూయా

1.బానిసత్వము నుండి 
శ్రమలబారినుండి-విడిపించావు నన్ను 
ధీనదశలో నేనుండగా నను విడువనైతివి ॥ భూమ్యాకాశములు ||

2.జీవాహారమై నీదువాక్యము పోషించెనునన్ను ఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి || భూమ్యాకాశములు ||

3.భుజంగములను అణచివేసి కాచినావు నన్ను ఆపదలో చిక్కుకొనగా నను లేవనెత్తితివి || భూమ్యాకాశములు ||

4.నూతన యెరుషలేం నిత్యనివాసమని తెలియజేసితివి
నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవపరచితివి ॥ భూమ్యాకాశములు ||

Post a Comment

0 Comments