106.Sarirarevvaru Na Priyudaina|సరిరారెవ్వరూ నా ప్రియుడైన|Song Lyrics in Telugu|Hosanna Ministries

పల్లవి : సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి 
సరిహద్దులు లేని పరిశుద్ధునికి

1.నమ్మదగిన వాడే నలుదిశల నెమ్మది కలుగజేయువాడే
నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే 
నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే || సరిరారెవ్వరూ ||

2.ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే
ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే
నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే || సరిరారెవ్వరూ ||

3.పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే
శ్రేష్ఠమైన పునరుత్థాన బలము యిచ్చినాడే 
నాకై అతిత్వరలో మహిమతో రానైయున్నావాడే || సరిరారెవ్వరూ ||

Post a Comment

0 Comments