నిత్యజీవము గలది ప్రియ ప్రభువా
1.పాపినగు నన్ను ఓ ప్రభువా - పరిశుద్ధపరచెను నీ
కృపయే
పరమ స్వాస్థ్యము నొందుటకు ప్రేమతో నన్ను పిలిచితివే || దేవా! నీ కృప ||
2. రక్షణ భాగ్యము పొందుటకు - రక్షక యేసు నీ కృపయే
నిత్యము నీతో నుండుటకు - నిత్య జీవము నిచ్చితివే || దేవా! నీ కృప ||
3.విశ్వాస జీవితం చేయుటకు - విజయము నిచ్చెను నీ కృపయే
శోధన బాధలు అన్నిటిలో - శక్తినొసంగి నడిపితివే || దేవా! నీ కృప ||
4.కృపలో నడుపుము ఓ దేవా - కృపతో నింపుము నా ప్రభువా
నిత్యము కృపలో నన్ను నడిపి - నిన్నెదుర్కొనుటకు శక్తినిమ్ము || దేవా! నీ కృప ||
0 Comments